: ఏపీకి ప్రపంచ బ్యాంకు, ఏఐఐబీ రుణాలు మంజూరు


ఏపీకి ప్రపంచ బ్యాంకు, ఏఐఐబీ రుణాలు మంజూరైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ బ్యాంకు నుంచి 240 మిలియన్ డాలర్లు, ఏఐఐబీ నుంచి 160 మిలియన్ డాలర్ల రుణం మంజూరైందని అన్నారు. నిరంతర విద్యుత్ సరఫరాకు మౌలిక వసతుల కల్పన నిమిత్తం ఈ రుణాలు మంజూరయ్యాయని చెప్పారు. రుణానికి సంబంధించి ఒప్పందం చేసుకున్నామని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఒప్పందంపై ఏపీ తరపున రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.రంగనాథం సంతకం చేశారు.

  • Loading...

More Telugu News