: మానససరోవరం యాత్రలో చిక్కుకున్న తెలుగు యాత్రికులు!


మానస సరోవరం యాత్రకు వెళ్లిన వారిలో 1000 మంది యాత్రికులు తిరుగు ప్రయాణంలో చిక్కుకుపోయారు. సెమికోస్ట్ వద్ద చిక్కుకున్న వారిలో తెలుగు యాత్రికులు ఉన్నారు. మూడు రోజులుగా విశాఖ జిల్లా యాత్రికులు అక్కడ అవస్థలు పడుతున్నారు. మరో వారం పాటు ఇదే పరిస్థితి ఉంటుందని ప్రైవేట్ ట్రావెలర్స్ చెబుతున్నారు. దీనికితోడు, ఫోన్లు కూడా పనిచేయకపోవడంతో యాత్రికుల గురించి వారి బంధువులకు ఎటువంటి సమాచారం తెలియకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి తమకు సహకరించాలని యాత్రికులు, బంధువులు కోరుతున్నారు. కాగా, తిరుగు ప్రయాణంలో ప్రతికూల వాతావరణం కారణంగా సెమికోస్ట్ నుంచి నేపాల్ గంజ్ వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ సేవలు నిలిపివేశారు.

  • Loading...

More Telugu News