: చివరి కోరికను తీర్చుకుంది... తన బెస్ట్ ఫ్రెండ్ ను పెళ్లాడిన ఐదేళ్ల చిన్నారి!


కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న స్కాట్లాండ్ కు చెందిన ఐదేళ్ల చిన్నారి ఇలీధ్ పాటర్సన్ తన కోరికను తీర్చుకుంది. ఆమె ఎక్కువ రోజులు బ‌త‌క‌ద‌ని వైద్యులు తేల్చ‌డంతో ఆ చిన్నారి కోరికలన్నింటినీ తీర్చాల‌ని ఆమె కుటుంబ స‌భ్యులు భావించారు.  ఏం కావాలని ఆ చిన్నారిని అడిగారు. ఊహకు కూడా అంద‌ని విధంగా తన పెళ్లి చేయాల‌ని కోరింది. మొద‌ట షాక్ అయిన ఆమె త‌ల్లిదండ్రులు త‌మ‌ చిన్నారి కోరికను తీర్చి తీరాల‌ని అనుకున్నారు. తన బెస్ట్ ఫ్రెండ్ హ్యారిసన్ గ్రేర్ తో త‌న పెళ్లి చేయాల‌ని అడిగిన ఇలీధ్ పాటర్సన్ కోరిక ప‌ట్ల సానుకూలంగా స్పందించి ఆ బాలుడి కుటుంబ స‌భ్యుల‌ను ఒప్పించి పెళ్లి చేశారు. పెళ్లి దుస్తుల్లో ఆ చిన్నారి పెళ్లి కూతురు అంద‌రినీ ఆక‌ర్షించింది.

  • Loading...

More Telugu News