: ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూస్తున్నాను!: ప‌వ‌న్ క‌ల్యాణ్


త‌మ పార్టీ నిర్వ‌హిస్తోన్న శిబిరాల గురించి, అందులో పాల్గొంటున్న యువ‌త గురించి ఈ రోజు ఆ పార్టీ అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ కల్యాణ్ తెలుసుకున్నారు. శిబిరాల్లో కొన‌సాగుతోన్న ఎంపిక‌ల ప్ర‌క్రియ విధానం, పాల్గొన్న యువ‌త ఇచ్చిన స్పీచ్‌ల వీడియోల‌ను హైద‌రాబాద్‌లోని జ‌న‌సేన కార్యాల‌యంలో చూశారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ పాల‌కులు చేస్తోన్న త‌ప్పుకి ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతుండ‌డం చూసి తాను చ‌లించిపోయానని అన్నారు. ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన‌ప్పుడు అందులో జ‌రిగిన త‌ప్పు ఒప్పుల‌ను ప‌రిశీలించానని చెప్పారు. అందులో జ‌రిగిన త‌ప్పుల‌ను మ‌ళ్లీ పున‌రావృతం కాకుండా చూస్తున్నాన‌ని అన్నారు. జులై నాటికి జ‌న‌సేన సైనికుల ఎంపిక ప్ర‌క్రియ ముగుస్తుంద‌ని చెప్పారు. సామాజిక స్పృహ ఉన్న వారు రాజ‌కీయాల్లోకి రావాలని, అందుకే ఇలా ఎంపిక‌లు చేస్తున్నామ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు.      

  • Loading...

More Telugu News