: కేసీఆర్ నిజ స్వరూపం త్వరలోనే బయటపడుతుంది: మల్లు రవి
సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని, ఆయన నిజస్వరూపం త్వరలోనే బయటపడుతుందని కాంగ్రెస్ నేత మల్లు రవి విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ మాటల సీఎం తప్పా, చేతల సీఎం కాదని అన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ పై కేసీఆర్ ప్రకటన చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కార్ కు, బీజేపీకి మధ్య సంపూర్ణ అవగాహన ఉందని, అందుకు నిదర్శనం పెద్దనోట్ల రద్దుకు, ఏన్డీఏ తరపున ప్రకటించిన రాష్ట్రపతి అభ్యర్థికి తెలంగాణ సీఎం మద్దతు పలకడమేనని అన్నారు.