: చైనా పర్యటనకు సిద్ధమైన కేటీఆర్
తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఈ నెలాఖరున చైనా పర్యటనకు వెళుతున్నారు. ఈ పర్యటనకు చెందిన దస్త్రం ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఉంది. ఆయన ఆమోదం తెలిపిన వెంటనే చైనా పర్యటన ఖరారవుతుంది. చైనాలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సుకు కేటీఆర్ కు ఆహ్వానం అందింది. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. నెలాఖరు లోపు ఆయన హైదరాబాద్ చేరుకునే పక్షంలోనే కేటీఆర్ చైనా పర్యటన సాగే వీలుందని... లేకపోతే రద్దయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని సమాచారం.