: హీరో విజయ్ కోసం ఒక చిన్న ఆర్ట్ వర్క్ చేశా: హీరోయిన్ కీర్తి సురేష్
కోలీవుడ్ నటుడు విజయ్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దర్శకుడు మురుగదాస్ 'హ్యాపీ బర్త్ డే విజయ్ సర్' అంటూ ట్వీట్ చేశారు. విజయ్ కోసం స్వయంగా ఓ చిత్రం వేసిన హీరోయిన్ కీర్తి సురేష్... తాను ఒక చిన్న ఆర్ట్ వర్క్ చేశానని ఆ ఫొటోను పోస్ట్ చేసి, హ్యాపీ బర్త్ డే విజయ్ అని పేర్కొంది. మరో హీరోయిన్ కాజల్ కూడా విజయ్‌కి హ్యాపీ బర్త్ డే చెబుతూ ఆయన మరిన్ని విజయాలు సాధించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపింది.