: రవి ఎవరో నాకు తెలియదు... నా సోదరుడు ఆసుపత్రిలో ఉన్నాడు: నటి జీవిత
జూబ్లీహిల్స్ లోని శ్రీనివాస్ ఎంటర్ ప్రైజెస్ కార్యాలయంపై దాడి చేసిన సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రూ. 7 కోట్ల విలువైన పాత నోట్లను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీనివాస్ తో పాటు రవి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు నటి జీవిత సోదరుడని వార్తలు వచ్చాయి. దీనిపై జీవిత స్పందించారు. శ్రీనివాస్ అనే వ్యక్తి తమ వద్ద పని చేస్తారని, రవి ఎవరో తమకు తెలియదని ఆమె తెలిపారు. ఈ ఘటనతో తను సోదరుడికి సంబంధం లేదని చెప్పారు. తన సోదరుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.