: మోదీకి అంత తీరిక ఎక్కడిది?: వీహెచ్


దేశానికి వెన్నెముక అయిన రైతులపై ఎలాంటి పన్ను భారం మోపరాదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. రైతులు ఉపయోగించే పరికరాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఉండాలని అన్నారు. రైతుల పనిముట్లను జీఎస్టీ కిందకు తీసుకొస్తే... వారిపై భారం మరింత పెరుగుతుందని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా జరిగింది. ఈ కార్యక్రమానికి వీహెచ్, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలితలతో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ, 40 సార్లు విదేశాల్లో పర్యటించిన మోదీకి ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలను పరామర్శించే తీరిక మాత్రం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పనిముట్లను జీఎస్టీ పరిధి నుంచి తొలగించేంత వరకు తమ పోరాటం ఆగదని చెప్పారు. 

  • Loading...

More Telugu News