: ప్రతిపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా మీరా కుమార్ లేదా అంబేద్కర్ మనవడు?
ప్రతిపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ లలో ఒకరిని నిలబెట్టనున్నట్టు సమాచారం. ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత సామాజిక వర్గానికి చెందిన రామ్ నాథ్ కోవింద్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, మీరా కుమార్, ప్రకాశ్ అంబేద్కర్ లో ఒకరిని ప్రతిపక్ష పార్టీల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే అవకాశముంది. వామపక్ష పార్టీలు మాత్రం ప్రకాశ్ అంబేద్కర్ పేరును ప్రతిపాదించేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రతిపక్ష పార్టీల సమావేశం అనంతరం వీరిద్దరిలో ఒకరి పేరును ప్రకటించనున్నారు.