: సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించిన ఇంగ్లండ్
మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా సౌతాంప్టన్ లో జరిగిన తొలి మ్యాచ్ లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఏబీ డీవిలియర్స్ 65 పరుగులు, బెహర్డీన్ 64 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 14.3 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ ను మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ జేజే రాయ్ 28 పరుగులు చేసి ఔట్ కాగా, మరో ఓపెనర్ హేల్స్ 47 పరుగులతో, బెయిర్ స్టో 60 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా బెయిర్ స్టో ఎంపికయ్యాడు.