: ఆదోనిలో దొరికిపోయిన 'శంకర్ దాదా ఎంబీబీఎస్'లు..!


కర్నూలు జిల్లా ఆదోనిలో నకిలీ వైద్యులను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, స్థానికంగా ఉన్న విజయ గౌరి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి చెందిన వైద్యులు నాగేంద్ర ప్రసాద్, ఆయన భార్య జ్యోతిలు ఇంజినీరింగ్ చదివి, డాక్టర్లుగా చలామణి అవుతున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ జీఎంహెచ్ వో శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వీరిని కోర్టులో హాజరుపరచగా... జడ్జి రిమాండ్ కు పంపారు. వీరిపై ఐపీసీ సెక్షన్లు 420, 468, 478ల కింద కేసు నమోదు చేశారు. వచ్చీ రాని వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైద్యులు జిల్లాలో మరికొంత మంది ఉన్నట్టు విజిలెన్స్ దర్యాప్తులో తేలినట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News