: ఆల్ టైమ్ రికార్డుకు సెన్సెక్స్, నిఫ్టీ... మదుపరుల సంబరాలు


ఆసియా మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలకు తోడు ఫండ్ సంస్థల నుంచి వచ్చిన కొనుగోలు మద్దతుతో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్ ఆల్ టైమ్ రికార్డులను తాకగా, మదుపరులు సంబరాలు చేసుకున్నారు. గురువారం ఉదయం మార్కెట్ సెషన్ ప్రారంభం కాగానే, క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈ సూచిక 109 పాయింట్లు పెరిగి 31,393 పాయింట్లకు చేరగా, నిఫ్టీ సూచిక 30 పాయింట్ల వృద్ధితో 9,663 పాయింట్లకు చేరింది. ఆపై వచ్చిన కొనుగోలు మద్దతుతో, 11.10 గంటల సమయంలో సెన్సెక్స్ 228 పాయింట్లు పెరిగి 31,512 పాయింట్లకు చేరింది. మధ్యాహ్నం 1.10 గంటల సమయంలో 31,458 పాయింట్ల వద్ద సెన్సెక్స్ కొనసాగుతుండగా, నిఫ్టీ, 9,680 పాయింట్ల వద్ద ఉంది. నేటి సెషన్ లో హెచ్డీఎఫ్సీ, పవర్ గ్రిడ్, ఏసియన్ పెయింట్స్, టాటా మోటార్స్, టాటామోటార్స్ డీవీఆర్, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్ తదితర కంపెనీలు లాభాలను పండించుకున్నాయి.

  • Loading...

More Telugu News