: అనూహ్య నిర్ణయం తీసుకున్న న్యూజిలాండ్ క్రికెటర్, పించ్ హిట్టర్ ల్యూక్ రోంచీ


ప్రముఖ న్యూజిలాండ్ క్రికెటర్, భారీ షాట్లతో విరుచుకుపడే ఆటగాడిగా పేరు తెచ్చుకున్న ల్యాక్ రోంచీ, అనూహ్యంగా తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ లోని టెస్టులు, వన్డేలు, టీ-20 ఫార్మాట్ల నుంచి వీడ్కోలు తీసుకుంటున్నానని తెలిపాడు. ఒకే సమయంలో మూడు ఫార్మాట్లలోనూ దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించడం తనకు దక్కిన అదృష్టమని, తన కెరీర్ కు ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని భావించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నానని 36 ఏళ్ల రోంచీ తెలిపాడు. కాగా, 2008 నుంచి క్రికెట్ ఆడుతున్న రోంచీ 85 మ్యాచ్ లు ఆడి, 170 పరుగుల అత్యధిక స్కోరు సహా 1397 పరుగులు చేశాడు. 32 టీ-20 పోటీలు ఆడాడు. కేవలం నాలుగు టెస్టులు మాత్రమే ఆడినప్పటికీ, 319 పరుగులు చేశాడు.

  • Loading...

More Telugu News