: రాజశేఖర్ సినిమాకు సంబంధించిన ప్రొడక్షన్ మేనేజర్ అరెస్టు
హైదరాబాదులో 7 కోట్ల విలువైన పాతనోట్లును సెంట్రల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాదులోని జూబ్లిహిల్స్ లో 7 కోట్ల రూపాయల విలువైన రద్దైన పాతనోట్లతో నటుడు రాజశేఖర్ సినిమాకు సంబంధించిన ప్రొడక్షన్ మేనేజర్ శ్రీనివాసరావును టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గతంలో శ్రీనివాసరావును అక్రమ డ్రగ్స్ రవాణా కేసులో పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఆర్బీఐ నెలరోజులపాటు పోస్టాఫీసులు, డీసీసీబీలలోని పాత నోట్లు అనుమతినిచ్చిన నేపథ్యంలో భారీ మొత్తంలో నగదు తరలిస్తున్నారన్న సమాచారంతో దాడులు చేసి, 7 కోట్ల రూపాయలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు.