: అమ్మాయి పొట్టి దుస్తులు వేసుకుందని ఎలా కొట్టి పారిపోయాడో చూడండి!
రంజాన్ మాసం సాగుతున్న వేళ, పొట్టి దుస్తులు వేసుకుని బస్సు ఎక్కిందని ఆరోపిస్తూ, ఓ అమ్మాయిని లాగి కొట్టడంతో పాటు అదేమని ప్రశ్నించినందుకు గట్టిగా నెట్టేసి అంతే వేగంతో పారిపోయాడో యువకుడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అయిన ఈ ఘటన టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో జరిగింది. బుధవారం నాడు అసీనా మెలిసా సగ్లామ్ (21) అనే యువతి బస్సులో షార్ట్ ధరించి ఓ సీటులో కూర్చుని ఉంది. ఆమె వెనకే ఉన్న ఓ యువకుడు, బస్సు దిగి వెళుతూ చెంపపై ఒక్కటిచ్చాడు. అతను బస్సు దిగేలోపే వేగంగా వచ్చిన బాధితురాలు నిలదీయగా, గట్టిగా వెనక్కు నెట్టివేశాడు. ఆపై ఆమె ఏడుస్తూ కూలబడిపోగా, సాటి ప్రయాణికులు సహాయం చేశారు. ఈ ఘటనంతా బస్సులోని సీసీ కెమెరాలో రికార్డయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, మెలిసాకు పలు మహిళా సంఘాలు అండగా నిలిచాయి. బస్సులోని వీడియో మీరూ చూడవచ్చు.