: 'ఇక కోహ్లీ చాలు బాబోయ్... ధోనీకి పగ్గాలివ్వండి' అంటూ క్రికెట్ ఫ్యాన్స్ డిమాండ్


టీమిండియాలో నెలకొన్న వివాదం గాలివానగా మారగా, కెప్టెన్ గా విరాట్ కోహ్లీని తప్పించి, తిరిగి మహేంద్ర సింగ్ ధోనీకి పగ్గాలు ఇవ్వాలన్న డిమాండ్ కు మద్దతు పెరుగుతోంది. 2019 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని జట్టులో ధోనీ, యువరాజ్ సింగ్ ల పాత్ర ఏంటన్న విషయమై సత్వర నిర్ణయం తీసుకోవాలని ఇండియా 'ఏ' కోచ్ రాహుల్ ద్రావిడ్ కోరిన వేళ, సామాజిక మాధ్యమాల్లో వేలాది మంది క్రికెట్ అభిమానులు కోహ్లీని తప్పించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే 35 సంవత్సరాల వయసులో కెరీర్ చరమాంకానికి ధోనీ చేరుకున్నప్పటికీ, ఇటీవలి పరిస్థితులు తిరిగి ధోనీకి కెప్టెన్సీ ఇవ్వాలన్న డిమాండ్ పుట్టేలా చేశాయి. కోహ్లీ వైఖరి కారణంగానే కుంబ్లే జట్టుకు దూరమయ్యాడని ఎంతో మంది సీనియర్లు విమర్శిస్తుంటే, ఈ విభేదాలే చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ పై పరాజయానికి కారణమని అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. భారత్ కు సంబంధించినంత వరకూ మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ఉన్న ధోనీ, మరింత కాలం పాటు జట్టును నడిపించగలడని వ్యాఖ్యానిస్తున్నారు.

  • Loading...

More Telugu News