: ఫ్లిప్ కార్ట్ గోల్డెన్ ఆఫర్... రూ. 9999కే ఏసర్ ల్యాప్ టాప్


'బ్యాక్ టూ కాలేజ్' అమ్మకాల్లో భాగంగా ల్యాప్ టాప్ లపై భారీ డిస్కౌంట్లను అందించనున్నట్టు దేశీయ ఈ-కామర్స్ సేవల సంస్థ ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఏషర్ వన్ 10 ఆటమ్ టూ-ఇన్-వన్ ల్యాప్ ట్యాప్ ను రూ.9999కే అందించనున్నట్టు వెల్లడించింది. ఇంటెల్ కోర్ ఐ3 ల్యాప్ ట్యాప్ ను రూ. 22,990 పై అందిస్తూ, అదనంగా రూ. 3 వేల వరకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్టు పేర్కొంది.

గేమింగ్ ల్యాప్ టాప్ ల ఎక్స్చేంజ్ పై రూ. 20 వేల వరకు తగ్గింపును ఇస్తున్నామని తెలిపింది. రూ. 82 వేల ధర ఉన్న ఐఫోన్ 7 ప్లస్ (128 జీబీ)పై 25 డిస్కౌంట్ ఇచ్చి రూ. 59,999కి కస్టమర్లకు అందిస్తున్నామని, ఐఫోన్ 7 (32 జీబీ) వేరియంట్ ధరను రూ. 60 వేల నుంచి రూ. 42,499కి తగ్గించామని తెలిపింది. మిగతా ఐఫోన్ మోడల్స్ పై కనీసం రూ. 2 వేల తగ్గింపు ఉంటుందని, ఈ ఆఫర్లు నేటి నుంచి మూడు రోజుల పాటు కొనసాగుతాయని వెల్లడించింది.

  • Loading...

More Telugu News