: ముందు నోరు తెరిచి ఏం జరిగిందో చెప్పు: కోహ్లీకి గవాస్కర్ సూటి ప్రశ్న
భారత జట్టుకు కోచ్ గా అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన తరువాత కెప్టెన్ కోహ్లీపై పలువురు సీనియర్లు విరుచుకుపడుతున్నారు. జట్టును చక్కగా నడిపిస్తున్న కుంబ్లే తప్పుకోవడానికి కోహ్లీనే కారణమని విమర్శలు వస్తున్న నేపథ్యంలో గవాస్కర్ స్పందించారు. "కోహ్లీకి నా సలహా ఏంటంటే, పరిస్థితి సద్దుమణిగేలా ఓ ప్రకటన విడుదల చేయాలి. ముందు కోహ్లీ మాట్లాడాలి" అన్నారు.
ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, టీమ్ లో నెలకొన్న వాస్తవ పరిస్థితి బయటకు వస్తేనే సర్దుబాటు చేసేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. కాగా, క్రీడాభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, కుంబ్లే రెండు రోజుల క్రితం కోచ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆపై తన వైఖరి కారణంగానే కుంబ్లే జట్టుకు దూరమయ్యాడని ఎన్ని విమర్శలు వస్తున్నా విరాట్ కోహ్లీ మాత్రం ఇంకా నోరు మెదపలేదు.