: కొత్త ట్విస్టు... భర్తకు రెండు లొకేషన్లను షేర్ చేసిన బ్యూటీషియన్ శిరీష?
హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ లో ఆర్జీఏ స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన బ్యూటీషియన్ శిరీష ఘటనలో తవ్వేకొద్దీ పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. శిరీషను కుక్కునూరుపల్లి పోలీస్ క్వార్టర్స్ కు తీసుకెళ్లారని, అక్కడ ఎస్సై అత్యాచారయత్నం చేయబోతే శిరీష ప్రతిఘటించిందని, తోవపొడవునా ఆమె గొడవ చేయడంతో స్టూడియోకు తీసుకొచ్చామని, స్టూడియోలోకి వెళ్లిన అనంతరం ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని నిందితులు విచారణలో తెలిపారని పోలీసులు చెబుతున్నారు.
అయితే తాజాగా కొత్త విషయం వెలుగు చూసింది. శిరీష తన భర్తకు మొబైల్ ద్వారా రెండు లొకేషన్లు షేర్ చేసింది. ఒక లొకేషన్ కుక్కునూరుపల్లికి 4 కిలోమీటర్ల దూరంలోని రిసార్ట్ కాగా, మరొకటి జాతీయరహదారి.. అంటే ఈ లొకేషన్లు ఆమె ఏ పరిస్థితుల్లో షేర్ చేసి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శిరీషను కేవలం రిసార్టుకి మాత్రమే తీసుకెళ్లారా? అలాంటప్పుడు రెండో ప్లేస్ ను ఆమె ఎందుకు షేర్ చేసింది? ఆమెను హత్య చేసేందుకు ప్రీ ప్లాన్డ్ గా తీసుకెళ్లారా? అన్న పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.