: భారత్‌లో 4జీ సూపర్.. డౌన్‌లోడింగ్ స్పీడ్‌లో మాత్రం పరమ చెత్త!


4జీ నెట్‌వర్క్ లభ్యత విషయంలో భారత్ బ్రహ్మాండంగా ఉన్నా వేగంలో మాత్రం పరమ చెత్తగా ఉందని రీసెర్చ్ వెబ్‌సైట్ ఓపెన్ సిగ్నల్ డాట్ కామ్ వెల్లడించింది. 4జీ లభ్యత విషయంలో దక్షిణ కొరియా 96.4 శాతంతో అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో జపాన్ (93.5 శాతం), నార్వే (87.0 శాతం), అమెరికా (86.5 శాతం), ఇండియా (81.6శాతం) నిలవగా లభ్యత విషయంలో శ్రీలంక 40.1 శాతంతో అట్టడుగున నిలిచింది. యూకే, జర్మనీ, ప్రాన్స్, ఐర్లాండ్, ఈక్వెడార్‌లు వరుసగా భారత్ తర్వాతి స్థానంలో నిలిచాయి.

4జీ లభ్యత విషయంలో చాలా దేశాల కంటే మెరుగ్గా ఉన్న భారత్ సగటు డౌన్‌లోడింగ్ వేగంలో మాత్రం ఘోరమైన స్థితిలో ఉంది. డౌన్‌లోడింగ్ స్పీడ్‌లో సింగపూర్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండగా భారత్ మాత్రం దానికంటే తొమ్మిదిరెట్లు తక్కువగా ఉంది. ఈ విషయంలో సింగపూర్ 45.6 ఎంబీపీఎస్ వేగంతో అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో దక్షిణ కొరియా (43.5 ఎంబీపీఎస్), హంగేరీ (42.6 ఎంబీఎస్) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక డౌన్‌లోడ్ వేగంలో 5.1 ఎంబీపీఎస్ వేగంతో కోస్టారికా, భారత్‌లు కింది నుంచి తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. హంగేరీ తర్వాత జపాన్ (24.5), ఫ్రాన్స్ (24.2), యూకే (22.7), జర్మనీ (20.5), అమెరికా (15.0), ఇండోనేసియా (7.7) వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

  • Loading...

More Telugu News