: రంజాన్ ఎఫెక్ట్... 42 మంది భారతీయ ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన ఖతార్ రాజు
పవిత్ర రంజాన్ మాసం 42 మంది భారతీయులకు పునర్జన్మని ప్రసాదించింది. రంజాన్ ను పురస్కరించుకుని ముస్లిం దేశాలు పలువురు ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తాయి. ఈ నేపథ్యంలో వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తూ ఖతార్ జైళ్లలో మగ్గుతున్న 42 మంది భారతీయ ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించినట్టు ప్రకటించింది. ఈ మేరకు ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ ఉత్తర్వులు జారీచేశారని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ఈ 42 మంది జాబితాను ఇంకా ప్రకటించలేదని తెలుస్తోంది. అయితే ఇతర ముస్లిం దేశాలు పలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న ఖతార్ భారీ సంఖ్యలో భారతీయ ఖైదీలపై ఔదార్యం చూపడం విశేషం. కాగా, ఈ ఖైదీల్లో అత్యధికులు యజమానుల అక్రమ కేసుల బనాయింపు కారణంగా జైలుకెళ్లిన వారని తెలుస్తోంది.