: ఐఎస్ మరో ఘాతుకం.. మోసుల్‌లోని ప్రఖ్యాతిగాంచిన నూరి మసీదు ధ్వంసం


ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ మరో ఘాతుకానికి తెగబడింది. మోసుల్‌లోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నూరి మసీదును ధ్వంసం చేసింది. బుధవారం రాత్రి మసీదులో బాంబులు పెట్టి పేల్చివేసినట్టు ఇరాక్ అధికారులు పేర్కొన్నారు. ఐఎస్ చీఫ్ అబు బకర్ అల్-బగ్దాదీ ఇదే మసీదులో 2014లో తనను తాను ఇస్లామిక్ కలీఫట్‌గా ప్రకటించుకున్నాడు. అనంతరం ఇస్లామిక్ స్టేట్ ఈ నగరాన్ని స్వాధీనం చేసుకుంది.

మోసుల్‌లోని ఓల్డ్ సిటీలో దాదాపు లక్షమంది పౌరులు ఉగ్రవాదుల చేతిలో చిక్కుకుపోవడంతో వారిని క్షేమంగా విడిపించేందుకు గతవారం ఇరాకీ దళాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి మోసుల్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. గత ఎనిమిది నెలలుగా ఇక్కడ ఇరాకీ దళాలకు, ఐఎస్ ఉగ్రవాదులకు మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇప్పటి వరకు 8.50 లక్షల మంది మోసుల్ నుంచి వలస వెళ్లారు.

  • Loading...

More Telugu News