: రానాతో రాజమౌళి 'బాహుబలి-3 చేద్దాం' అనగానే ప్రభాస్ ఏమన్నాడో తెలుసా?
'బాహుబలి-2' విడుదలై విజయం సాధించిన అనంతరం 'బాహుబలి-3' సినిమాపై ఎన్నో కథనాలు వచ్చాయి. 'బాహుబలి-2'కి సీక్వెల్ ఉంటుందా? లేదా? వంటి ప్రశ్నలకు రాజమౌళి స్పందిస్తూ... 'బాహుబలి-3' సినిమా తీసే ఆలోచన లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రానా బుల్లితెరపై 'నెంబర్ వన్ యారీ విత్ రానా' అనే షో చేస్తున్నాడు. ఈ షో జూన్ 25 నుంచి ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో గెస్టుగా రాజమౌళిని రానా ఆహ్వానించాడు. ఇందులో భాగంగా రాజమౌళి ప్రభాస్ కి ఫోన్ చేసి.... ‘డార్లింగ్ అర్జెంటుగా కలవాలి’ అనగానే, ప్రభాస్.. ‘ఎందుకు?’ అని ప్రశ్నించాడు. ‘‘బాహుబలి పార్ట్ 3’ అని రాజమౌళి అన్నాడు. ఆ వెంటనే.. అటువైపు నుంచి ప్రభాస్ ఒక్కసారి ఆశ్చర్యపోయి.. ‘అమ్మ నీ యమ్మా’ అన్నాడు. దీంతో రానా, రాజమౌళి పెద్దగా నవ్వేశారు!