: ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో జనసేన సైనికుల ఎంపికలు: పవన్ కల్యాణ్
జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్.. తమ పార్టీలో పనిచేసేందుకు ఉత్సాహవంతమైన యువత కోసం శిబిరాలు ఏర్పాటు చేసి ఎంపికలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా ఈ నెల 24న ఆదిలాబాద్, 25న కరీంనగర్ జిల్లాల్లో శిబిరాలను నిర్వహిస్తున్నట్టు ఓ ప్రకటన ద్వారా ఆయన తెలిపారు.
ఆయా జిల్లాల పరిధిలోని అభ్యర్థులు రేపు, ఎల్లుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పవన్ సూచించారు. అలాగే ఈ నెల 24న మంచిర్యాల జిల్లాలోని ఫారెస్ట్ కాంట్రాక్టు అసోసియేషన్ ఫంక్షన్ హాలులో, 25న పెద్దపల్లి జిల్లాలోని డీసెంట్ ఫంక్షన్ హాల్‌లో జనసేన సైనికుల ఎంపిక ఉంటుందని అన్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ పలు జిల్లాల్లో ఎంపికలు పూర్తి చేసి పలువురిని ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే.