: పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో విమానానికి తప్పిన పెనుముప్పు!
భూమికి 35 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో చెన్నై నుంచి జకార్తా బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి ఆ విమానం ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరింది. సాంకేతిక లోపం తలెత్తిందని గుర్తించిన పైలట్.. వెంటనే కంట్రోల్ రూంకు సమాచారం ఇచ్చి, 6.45 గంటలకు దాన్ని సురక్షితంగా వెనక్కు తీసుకువచ్చాడు. ఆ విమానంలో ఐదుగురు సిబ్బంది సహా 155 మంది ఉన్నారు. ఆ ప్రయాణికులకు సమీపంలోని హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. రేపు ఉదయం వారిని జకార్తాకు పంపనున్నారు.