: వైఎస్సార్సీపీకి విన్నపం చేశాం.. ఇంకా స్పందన రాలేదు: నంద్యాల ఎన్నికపై సీఎం చంద్రబాబు
నంద్యాల టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డిని ప్రకటించామని, ప్రజలు ఆశీర్వదించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోరారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. అనంతరం, చంద్రబాబు మాట్లాడుతూ, సంప్రదాయం ప్రకారం చనిపోయిన వ్యక్తి కుటుంబంలోని వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని, ఈ విషయమై వైఎస్సార్సీపీకి విన్నపం చేశామని, వారి నుంచి ఇంకా స్పందన రాలేదని అన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడేందుకు ప్రణాళికలు చేస్తున్నామని, అమరావతి, కడప, కర్నూలులో హజ్ హౌస్ లు నిర్మిస్తామని, 80 వేల మంది ముస్లిం యువతులకు దుల్హన్ పథకం కింద వివాహాలు జరిపిస్తామని ఈ సందర్భంగా హామీ యిచ్చారు.