: అల్లు అర్జున్ కి అబ్జర్వేషన్ ఎక్కువ.. అందుకే సెట్లో జాగ్రత్తగా వుండే వాళ్లం!: దర్శకుడు హరీష్ శంకర్
అల్లు అర్జున్ లో ఉండే ఎనర్జీ అంటే తనకు బాగా ఇష్టమని దర్శకుడు హరీష్ శంకర్ అన్నారు. ‘డీజే’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆయన్ని చూస్తే బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ లా అనిపిస్తారని గతంలో చెప్పానని అన్నారు. అల్లు అర్జున్ కి అబ్జర్వేషన్ చాలా ఎక్కువని, ప్రతిదీ గమనిస్తారని, అందుకే సెట్ లో చాలా జాగ్రత్తగా ఉండేవాళ్లమని అన్నారు.
అలాగే, అల్లు అర్జున్ చాలా కష్టపడతారని, డైలాగ్స్ చెప్పే విషయంలో, యాక్షన్ విషయంలో ఏమాత్రం ఆయన కాంప్రమైజ్ కారని హరీష్ చెప్పారు. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ముగిసే రోజు వరకు ఏనాడు ఆయన చిరాకు పడటం కానీ, తొందరగా ముగించుకుని వెళ్లిపోదామని కానీ బన్నీ అనుకోలేదని చెప్పారు. తాను అనుకున్న దాని కన్నా సినిమా చాలా బాగా వచ్చిందని హరీష్ చెప్పుకొచ్చారు.