: వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయం: ఎమ్మెల్యే రోజా
వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా జోస్యం చెప్పారు. ఒంగోలులో జరిగిన వైఎస్సార్సీపీ ప్లీనరీలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న చంద్రబాబు పాలనను, అజెండాను, టీడీపీ జెండాను భూస్థాపితం చేసే సమయం ఆసన్నమైందని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.