: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. మరో 1857 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ
తెలంగాణలోని రెవెన్యూ శాఖలో 2506 ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలుపుతూ సీఎం కేసీఆర్ సర్కారు ఇటీవల నిరుద్యోగులకు శుభవార్త అందించిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్ర అటవీశాఖలో కూడా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆ శాఖలో మొత్తం 1857 బీట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని కేసీఆర్ నుంచి ఆదేశాలు రావడంతో ఆర్థికశాఖ ఈ రోజు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉద్యోగాలను త్వరలోనే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేయనుంది.