: ‘ఛాంపియన్స్’ విజేతలకు భారీ నజరానా ప్రకటించిన పాక్ ప్రధాని
ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన పాక్ జట్టుకు ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ భారీ నజరానా ప్రకటించారు. పాక్ జట్టు ఇంగ్లాండ్ నుంచి కరాచీకి నిన్న ఉదయం చేరుకుంది. ఈ సందర్భంగా పాక్ ఆటగాళ్లకు ఘనస్వాగతం లభించింది. ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న పాక్ జట్టులోని ప్రతి ఆటగాడికి కోటి రూపాయల చొప్పున అందజేయనున్నట్టు పాక్ పీఎంఓ సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా పాక్ మంత్రి మరియమ్ ఔరంగజేబు మాట్లాడుతూ, ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ జట్టు ప్రదర్శన అద్భుతమని, ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్ లో పాక్ చాలా బాగా రాణించిందని ప్రశంసించారు.