: అమెరికాకు వెళ్లే కేటీఆర్ కు నల్గొండకు వచ్చే సమయం లేదా?: కోమటిరెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయానికి రావడమే మర్చిపోయారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. మియాపూర్ భూముల మాదిరిగానే సచివాలయం కూడా కబ్జా అవుతుందేమో అంటూ సందేహాన్ని వ్యక్తం చేశారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం ఒక పెద్ద కుంభకోణమని ఆరోపించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తిపన్నును 200 శాతం పెంచారని మండిపడ్డారు. నెలకు నాలుగైదు సార్లు అమెరికా వెళ్లే కేటీఆర్ కు నల్గొండ రావడానికి సమయం లేదా? అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.