: ఢిల్లీ-ముంబై విమానంలో ప్రయాణికుడి అసభ్య ప్రవర్తన.. అరెస్టు!


ఢిల్లీ-ముంబై విమానంలో ఓ ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడు. గురుగావ్ కు చెందిన మోహిత్ కన్వర్ తన పక్క సీట్లో కూర్చున్న మహిళపై చేతులు వేయడం, తన ఇష్టానుసారం తాకడం వంటివి చేశాడు. ఈ విషయమై ఎయిర్ హోస్టెస్ కు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. మోహిత్ కన్వర్ పక్క నుంచి వేరే సీటులోకి ఆమె మారాల్సి వచ్చింది. ఆ సీట్ లో నుంచి వేరే సీట్ లోకి సదరు మహిళ వెళుతున్న సమయంలో కూడా మోహిత్ కన్వర్ ఆమెను వదిలిపెట్టలేదు. ‘నేను తాకడం నీకు నచ్చడం లేదా?’ అంటూ వేధింపుల పాలు చేశాడు. కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు విమానం ముంబై చేరుకోగానే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాధిత మహిళ వృత్తి రీత్యా లాయర్.

  • Loading...

More Telugu News