: సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ అదుర్స్


హిట్ల మీద హిట్లు కొడుతూ జోరు మీదున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తోన్న కొత్త సినిమా ‘జవాన్’ ఫస్ట్ లుక్ విడుదలైంది. సాయిధ‌ర‌మ్ తేజ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ఈ లుక్‌ను విడుద‌ల చేస్తూ... ‘కుటుంబానికా?  దేశానికా? ఈ సినిమాలో జై ఎవ‌రికి ప్రాధాన్య‌త ఇస్తాడు?’ అని పేర్కొన్నాడు. ఓ స్మార్ట్‌ఫోన్‌ను ప‌ట్టుకుని ఈ విష‌యంపైనే హీరో దీర్ఘాలోచ‌న‌లో ఉన్న‌ట్లు ఈ లుక్ ఉంది. హీరో చేతిలో ఉన్న‌ స్మార్ట్ ఫోన్‌లో ఆయన కుటుంబ స‌భ్యులు క‌న‌ప‌డుతున్నారు. ఇంటికొక్క‌డు అనే ఉప శీర్షిక‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు బీవీఎస్ ర‌వి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ రోజు ర‌వి పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ లుక్‌ను విడుద‌ల చేశారు.          

  • Loading...

More Telugu News