: రజనీ రాజకీయ ప్రవేశంపై స్పందించను: గౌతమి
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రంపై తాను స్పందించనని నటి గౌతమి తెలిపారు. దివంగత జయలలిత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారని అన్నారు. అయితే, జయ మరణం తర్వాత ఆమె ప్రవేశపెట్టిన పథకాలు సరిగ్గా అమలు కావడం లేదని విమర్శించారు. అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ గురించి అందరికీ తెలిసిందేనని చెప్పారు. యోగాను ప్రతి ఒక్కరు చేయాలని... తాను క్యాన్సర్ తో బాధపడుతున్నప్పుడు యోగా చాలా ఉపయోగపడిందని తెలిపారు.