: ఎయిర్ ఇండియాను సొంతం చేసుకునే దిశగా టాటా గ్రూప్?
అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరణ చేసే అంశంపై ఇంకా తుది ప్రకటన వెలువడక ముందే... ఆసక్తికర సమాచారం అందుతోంది. ఎయిర్ ఇండియాను సొంతం చేసుకోవడానికి పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ ప్రయత్నిస్తోంది. సింగపూర్ ఎయిర్ లైన్స్ భాగస్వామ్యంతో ఎయిర్ ఇండియాను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని 'ఈటీ నౌ' వెల్లడించింది. ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరణ చేయాలంటూ నీతిఆయోగ్ చేసిన ప్రతిపాదన మేరకు కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఎయిరిండియా జాతీయం కాకముందు టాటా గ్రూపులోనే ఓ భాగంగా ఉండేది.