: నేను ఇండియాకు ముందుగానే రావడానికి కారణం యోగా: మంచు లక్ష్మి
తాను ఇండియాకు రావడానికి కారణం ‘యోగా’యేనని ప్రముఖ నటి మంచు లక్ష్మి అన్నారు. యోగా డే సందర్భంగా ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, యోగా కారణంగానే తాను ఇండియాకు వచ్చానని, లేకపోతే ఐదేళ్ల తర్వాత ఇక్కడికి వచ్చి ఉండేదానినని చెప్పారు. తాను సర్టిఫైడ్ యోగా టీచర్ నని, యోగాతో ఆరోగ్యం, ఆనందం లభిస్తాయని, పరిపూర్ణ జీవితం యోగాతోనే సాధ్యమని, యోగాను జీవన విధానంగా మార్చుకోవాలని తాను నమ్ముతానని మంచు లక్ష్మి అన్నారు.