: తిరుపతిలో ఉన్నామంటూ డీజే టీమ్ తో దిగిన ఫొటోను పోస్ట్ చేసిన హరీశ్ శంకర్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా యువ దర్శకుడు హరీశ్ శంకర్ రూపొందించిన ‘డీజే: దువ్వాడ జగన్నాథం’ సినిమా ఎల్లుండి విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు శ్రీవారి సేవలో ‘డీజే’ చిత్ర బృందం పాల్గొంది. ఈ రోజు తిరుపతిలో ల్యాండ్ అవగానే హరీశ్ శంకర్ ఓ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అందులో అల్లు అర్జున్, పూజా హెగ్డే, నిర్మాత దిల్ రాజుతో హరీశ్ శంకర్ ఉన్నాడు. తమ చిత్రం బృందం తిరుపతిలో ఉందని పేర్కొన్నాడు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్న ఆ సినిమా బృందం మీడియా సమావేశంలో ఈ సినిమా విశేషాల గురించి చెప్పింది.