: అందుకే, నేను ఇంత స్మార్ట్ గా ఉన్నా: యోగా వేడుకల్లో ఎంపీ మల్లారెడ్డి
తాను ప్రతిరోజూ యోగా చేస్తానని, అందుకే, ఇంత స్మార్ట్ గా ఉన్నానని మల్కాజ్ గిరి టీఆర్ఎస్ ఎంపీ మల్లారెడ్డి అన్నారు. యోగా డే సందర్భంగా ఈ రోజు జేఎన్ టీయూ గ్రౌండ్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, ‘భారత దేశ ప్రజలందరికీ యోగా డే చాలా ముఖ్యమైంది. నేను ఓ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, యోగా గురించి నాకు మొదట్లో తెలియదు. లో ప్రొఫైల్ నుంచి వచ్చిన వ్యక్తిని. రోజూ పదిహేను సూర్య నమస్కారాలు చేస్తా, ఒక గంటా పది నిమిషాలు యోగా చేస్తున్నాను కాబట్టే నేను ఇంత స్మార్ట్ గా ఉన్నా. ఇక్కడ ఉన్నవాళ్లందరి కంటే స్మార్ట్ గా ఉన్నా’ అని మల్లారెడ్డి అనడంతో నవ్వులు విరిశాయి.