: బహిరంగ సభలో సీఎం చంద్రబాబు, వైసీపీ ఎమ్మెల్యే మ‌ధ్య వాగ్వాదం!


క‌ర్నూలు జిల్లాలోని తంగ‌డంచ‌లో ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు, వైసీపీ ఎమ్మెల్యే ఐజ‌య్య‌ల‌ మ‌ధ్య వాగ్వివాదం చెల‌రేగింది. ఈ ప్రాంతంలో నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న చంద్ర‌బాబు నాయుడు అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడారు. అనంత‌రం స్థానిక ఎమ్మెల్యే వైసీపీ నేత ఐజ‌య్య‌కు మాట్లాడే అవ‌కాశం ఇచ్చారు.

అయితే, మైకు ప‌ట్టుకున్న స‌ద‌రు ఎమ్మెల్యే చంద్ర‌బాబు నాయుడి ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డం మొద‌లుపెట్టారు. దీంతో ఆయ‌న మైకును క‌ట్ చేశారు. దీనిపై చంద్ర‌బాబు నాయుడు మండిప‌డ్డారు. ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే ఈ నియోజ‌క‌వ‌ర్గం ఎప్ప‌టికీ బాగుప‌డ‌ద‌ని అన్నారు. బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడే ప‌ద్ధ‌తి కూడా తెలియద‌ని వ్యాఖ్యానించారు. ఇది అసెంబ్లీ కాద‌ని, ఇటువంటి స‌భ‌ల్లో ఇలా మాట్లాడ‌డం ఏంట‌ని చంద్ర‌బాబు నాయుడు మండిప‌డ్డారు. 

  • Loading...

More Telugu News