: పట్టుకారును మింగేసిన పాము.. నరకయాతన.. వీడియో ఇదిగో!
ఏదయినా ఆహారపదార్థాన్ని నిప్పు మీద పెట్టి కాల్చడానికి మనం కిచెన్ లో పట్టుకారు అనే పరికరాన్ని ఉపయోగిస్తాం. అయితే, ఆ పట్టుకారును మింగేసిన ఓ పాము తరువాత నరకయాతన అనుభవించింది. ఈ విషయాన్ని గమనించిన ఆ ఇంటి యజమాని దాని నోట్లోంచి మళ్లీ ఆ పరికరాన్ని బయటకు తీశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో కానీ, ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్లో వైరల్గా మారింది. పాములోపలి నుంచి ఆ వ్యక్తి ఆ పరికరాన్ని బయటకు తీసిన తీరుపట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోను మీరూ చూడండి...