: రోబో 2.0 ఆడియో వేడుకకు ఖర్చు అక్షరాలా రూ.25 కోట్లు!


సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్, ద‌ర్శ‌కుడు శంకర్ కాంబినేష‌న్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపుదిద్దుకుంటున్న రోబో 2.0 సినిమా నిర్మాణానికి రూ.400 కోట్లకు పైగా ఖ‌ర్చు చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఆడియో వేడుక‌ను దుబాయ్‌లో నిర్వ‌హించాల‌ని ఈ సినిమా యూనిట్ నిర్ణ‌యం తీసుకుంది. ఈ వేడుక కోసం 25 కోట్ల రూపాయల‌ బడ్జెట్ ను నిర్ణ‌యించారు. రోబో 2.0 షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కావ‌డానికి ఆరు నెలల సమయం ప‌డుతుంది. ఈ సినిమా ఆడియో వేడుక‌కు పలువురు హాలీవుడ్ స్టార్స్ కూడా హాజ‌ర‌వుతార‌ట‌. ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు అక్షయ్ కుమార్ విల‌న్ పాత్రలో క‌న‌ప‌డుతున్నాడు. బ్రిటీష్ బ్యూటీ అమీజాక్సన్ ర‌జ‌నీ స‌ర‌స‌న న‌టిస్తోంది.

  • Loading...

More Telugu News