: పళనిస్వామికి మరో కష్టం... తమిళ సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టిన స్టాలిన్
తమిళనాడులో ప్రభుత్వాన్ని మరింత సంక్లిష్ట స్థితిలోకి నెడుతూ విపక్ష నేత, డీఎంకే శాసనసభా పక్ష నాయకుడు ఎంకే స్టాలిన్ కొద్దిసేపటి క్రితం అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ ప్రభుత్వం కొనసాగేందుకు అర్హత లేదని ఆరోపించిన ఆయన, తక్షణం ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. ఈ పరీక్షలో పళనిస్వామి ప్రభుత్వం నెగ్గే అవకాశాలే లేవని, ప్రభుత్వ వ్యతిరేక ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడు ప్రభుత్వం పడిపోతుందా? అని ఎదురు చూస్తున్నారని స్టాలిన్ అన్నారు.