: కొత్త సినిమాలో యంగ్ లుక్ లో కనపడనున్న పవన్‌ కల్యాణ్.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్


‘కాట‌మ రాయుడు’ చిత్రం త‌రువాత‌ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తోన్న కొత్త సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో కొన‌సాగుతోంది. ఈ సినిమాకు మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆ సినిమా సెట్‌లోకి పవన్ వస్తుండగా తీసిన ప‌లు ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌, పవనిజం పేరుతో ఉన్న ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్ ఖాతాల్లో ఈ ఫొటోలు క‌న‌ప‌డుతున్నాయి. వీటి‌లో పవన్‌ టీషర్ట్‌లో యంగ్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. పవన్ క‌ల్యాణ్ త‌న ఫ్యాన్స్‌కి అభివాదం చేస్తూ ముందుకు క‌దిలారు. ప‌వ‌న్ న‌టిస్తోన్న కొత్త సినిమాలో కీర్తి సురేశ్, అనూ ఇమ్మానుయెల్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ లుక్‌లో ప‌వ‌న్ క‌నిపించనున్నార‌ని ఈ ఫొటోల ఆధారంగా ప‌వ‌న్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News