: కాజల్, ఇలియానా వెస్ట్రన్ డ్రెస్సుల్లో కత్తిలా ఉంటారు...తమన్నా నడుం బాగుంటుంది: అల్లు అర్జున్


కాజల్, ఇలియానా వెస్ట్రన్ డ్రెస్సుల్లో కత్తిలా ఉంటారని అల్లు అర్జున్ కితాబు నిచ్చాడు. డీజే సినిమా ప్రమోషన్ లో మాట్లాడుతూ, ఈ విధంగా చెప్పాడు. జులాయి సినిమా షూటింగ్ విదేశాల్లో చేసినప్పుడు.. షూటింగ్ ముగిసిన తరువాత ఇలియానా తన రెగ్యులర్ డ్రెస్ వేసుకుని వెళ్లిందని, ఆ డ్రెస్ లో భలే ఉందని అన్నాడు. ఆమె నడుము కూడా బాగుంటుంది కనుక వెస్ట్రన్ డ్రెస్సులు తనకి బాగా నప్పుతాయని చెప్పాడు.

ఇక తమన్నా నడుము బాగుంటుందని, అందుకే చీరలో అయితే చాలా అందంగా ఉంటుందని అన్నాడు. సమంత చీరతో పాటు, వెస్ట్రన్ డ్రెస్సుల్లో కూడా బాగుంటుందని అన్నాడు. ఇక డీజే హీరోయిన్ పూజా హెగ్డే అయితే షార్ట్స్ లో చాలా బాగుటుందని అన్నాడు. ఆమె ఉండే హైట్ కి షార్ట్స్ చాలా బాగుంటాయని చెప్పాడు. షార్ట్స్ చాలా మందికి సూట్ కావని, ఆమెకు బాగా సూట్ అవుతాయని చెప్పాడు. ఈ సినిమా పాటల్లో డాన్స్ చేసేందుకు పూజా హెగ్డే చాలా కష్టపడిందని అల్లు అర్జున్ చెప్పాడు. ఇక తండ్రిగా అల్లు అరవింద్ అద్భుతమైన వ్యక్తి అని చెప్పాడు. తాను తండ్రిగా ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లలేనని చెప్పాడు. ఇక కొడుకుగా అయాన్ కంటే కూడా తాను చాలా అల్లరి పిల్లాడినని చెప్పాడు. 

  • Loading...

More Telugu News