: చిరంజీవి దరిదాపులకు కూడా ఎవరూ వెళ్లలేరు: అల్లు అర్జున్


మెగాస్టార్ చిరంజీవి దరిదాపులకు కూడా మెగా హీరోలెవరూ వెళ్లలేరని అల్లు అర్జున్ తెలిపాడు. 'డీజే' (దువ్వాడ జగన్నాథమ్) సినిమా ప్రమోషన్ లో మాట్లాడుతూ, మెగాస్టార్ అడుగుజాడల్లో అందరం నడుస్తున్నామని చెప్పాడు. మెగాస్టార్ ఇమేజ్ వస్తుందని ఎవరైనా అంటే కాంప్లిమెంట్ గా తీసుకుంటానని చెప్పాడు.

అయితే, చిరంజీవి సాధించిన దానిలో పది శాతం కూడా తాము సాధించలేమని చెప్పాడు. కనీసం ఆయనను అనుకరించే సాహసం కూడా చేయనని చెప్పాడు. ఆయనను అనుకరించలేనప్పుడు ఆయనను అనుకరిస్తే అది తప్పు చేయడమే అవుతుందని చెప్పాడు. మెగా వారసుల్లో ఎవరి స్టైల్ వారికి ఉంటుందని అన్నాడు. ఎవరిని ఎవరూ అనుకరించరని, కేవలం అనుసరిస్తారని చెప్పాడు. కేవలం మెగా ఫ్యామిలీలో వారికే కాదు, ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పాడు. అలా ఉంటే ఇండివిడ్యువాలిటీ ఉంటుందని అన్నాడు.

  • Loading...

More Telugu News