: ఆ పాట అంత హిట్ అవ్వడం వెనుక కొరియోగ్రఫీ ఉంది: అల్లు అర్జున్
'గుడిలో ఒడిలో మడిలో' పాట ఆడియో పరంగా అద్భుతంగా ఉంటే... అది మరింత అద్భుతంగా ఉండడానికి కారణం కొరియోగ్రఫీ అని అల్లు అర్జున్ చెప్పాడు. పాటే మెలోడీ కావడంతో అంతా అద్భుతంగా జరిగిందని అన్నాడు. ఈ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ బ్రాహ్మణుడు కావడంతో అతని నుంచి యాసను నేర్చుకున్నానని చెప్పాడు. సినిమాలో క్యాచీ పదాలు చాలా ఉన్నాయని చెప్పాడు. ఈ సినిమాలో తన ఆహార్యం అభిమానులను ఆకట్టుకుంటుందని చెప్పాడు. ఈ సినిమా అభిమానులను బాగా అలరిస్తుందని, సినిమాలోని డైలాగులను చాలా మంది ఊతపదాలుగా వాడతారని తెలిపాడు. సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.