: వర్థమాన హాస్యనటుడి ఇంటిపై విలన్ పాత్రధారి దాడి: జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు


వర్థమాన హాస్యనటుడి నివాసంపై విలన్ నటుడు దాడి చేసిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వర్థమాన హాస్య నటుడు డివి నాయుడు నివాసంపై 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో విలన్‌ వేషం వేసిన రాము తన అనుయాయులతో కలిసి దాడి చేశాడు. అంతే కాకుండా ఇంట్లోని మహిళల పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించాడని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అకారణంగా తన ఇంటిపై దాడి చేసి, వీరంగమేశాడని డివి.నాయుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

  • Loading...

More Telugu News