: మరోసారి నవ్వులు పూయించిన జలీల్ ఖాన్!


'కామర్స్ లో ఫిజిక్స్' డైలాగుతో చాలా పాప్యులర్ అయిన టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మరోసారి నవ్వులు పూయించారు. వివరాల్లోకి వెళ్తే, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో నిన్న ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది. ఈ విందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత చంద్రబాబుకు టోప్ (మత పెద్దలను గౌరవించి ఇచ్చే దుస్తులు) ను ధరింప జేశారు. టోప్ ధరించిన చంద్రబాబును చూసి ముస్లింలు మురిసిపోయారు. 'జయహో.. జోథా అక్బర్' అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా జలీల్ ఖాన్ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ముస్లింలు అందరూ టీడీపీ వైపే ఉన్నారని చెప్పారు. ముస్లింల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని విన్నవించారు. పనిలో పనిగా, తన జీవితాన్ని తమరే నిర్ణయించాలని... వేరేవారి చేతుల్లో పెట్టకండని చంద్రబాబును ఉద్దేశించి జలీల్ సరదాగా అన్నారు. దీంతో, చంద్రబాబు సహా అక్కడున్నవారంతా సరదాగా నవ్వుకున్నారు.

  • Loading...

More Telugu News