: తేజస్వినిని మాత్రమే వేధించు.. రాజీవ్ కు ఏమైనా అయితే చంపేస్తాను!: నందుతో బ్యూటీషియన్ శిరీష
హైదరాబాదు, ఫిల్మ్ నగర్ లో ఆర్జీఏ స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన బ్యూటీషియన్ శిరీషకు సంబంధించిన ఫోన్ సంభాషణ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ ఫోన్ సంభాషణలో తేజస్వినిని బెదిరించాలని నందు, నవీన్ అనే ఇద్దరు వ్యక్తులను కోరింది. ప్రధానంగా నందు అనే వ్యక్తితో జరిపిన సంభాషణలో రాజీవ్ కు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తేజస్వినిని వేధించాలని సూచించింది. మళ్లీ మరోసారి ఆమె రాజీవ్ జోలికి కానీ, తన జోలికి కానీ రాకుండా చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో నందు, శిరీషను బండ బూతులు తిడుతూ, రాజీవ్ ను వాడు అని సంబోధించడంతో రాజీవ్ ను 'వాడు' అనవద్దని హెచ్చరించింది. రాజీవ్ అనాలని సూచించింది. రాజీవ్ కు ఏదైనా అయితే చంపేస్తానని చెప్పింది. అయితే ఈ సంభాషణలను ఎవరు లీక్ చేశారు? అన్న విషయాలు తెలియకపోవడం విశేషం.